ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు మరోసారి మూసివేశారు. మంగళవారం మూసిన గేట్లను బుధవారం తెరవగా గురువారం సాయంత్రం వరద తగ్గడంతో మళ్లీ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు సైట్ వద్ద 98,765 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా పవర్ జనరేషన్ ద్వారా 55,088 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.