కెనడాకు చెందిన మాంట్రియల్ యూనివర్సిటీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం మన సౌర వ్యవస్థ వెలుపల భూమిని పోలిన, భూమికంటే పెద్ద గ్రహాన్ని కనుగొంది. ఇది మన భూమి కంటే 70 రెట్లు పెద్దదని, సుమారు 5 రెట్లు బరువైనదని తెలిపారు. దీనిపై కూడా లోతైన మహాసముద్రాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గ్రహంపై ఒక సంవత్సరం అంటే 11 రోజులేనని చెబుతున్నారు. మహా భూమిగా భావిస్తున్న ఈ గ్రహానికి పరిశోధకులు టీవోఐ-1452బీ అని పేరుపెట్టారు.