ప్రకాశం జిల్లా, దర్శి: పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఈ నెల 22న జరిగిన హత్య కేసును దర్శి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఎల్లారావుగాయాలతో మృతి చెంది ఉండగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పొలంలో పనులు చేసుకుంటున్న తమకు, ఇబ్బందులుపెడుతున్న ఎల్లారావును చంపాలనే ఉద్దేశ్యంతోరమణయ్య, చిన్న రమణయ్య, చిన్న వెంకటేశ్వర్లు లు హత్య చేసినట్లు దర్యాప్తులో తేలగా సీఐ రామకోటయ్య, ఎస్సై రామకృష్ణ వారిని అరెస్ట్ చేశారు.