ప్రకాశం, పుల్లలచెరువు: పేదల ఆకలి తీర్చేందను ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం వైకాపా దమన కాండకు పరాకాష్ట అని మండల పార్టీ అధ్యక్షుడు పి. ప్రసాద్ అన్నారు. గురువారం ప్రధాన రహదారిలో టిడిపి నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ ఆరాచన పాలనకు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.