విజయనగరం జిల్లాలో ఇటీవల ఉద్యోగాల పేరిట ఎక్కువుగా మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగుల అమాయకత్వాన్ని కొంతమంది మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి వారిపట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ కోరారు. మోసగాళ్ల సమాచారాన్ని వాట్సప్ నెంబర్ 93929 03402కు సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా ఇటీవల స్మార్ట్ విలేజ్ సంస్థలో ఉద్యోగాల పేరిట యువత మోసపోయారు.