అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి భారతీయ మహిళలపై దాడి జరిగింది. టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో మెక్సికన్‌కు చెందిన మహిళ ఓ పార్కింగ్ లాట్లో భారతీయ మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్ కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.