పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం ప్రజల ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఏర్పాట్లు చేశారు. 600 మంది మహిళలతో ఈ పూజలు నిర్వహించనున్నారు. పాల్గొనే మహిళలకు అందించేందుకు పూజాసామగ్రి ప్యాకెట్లు సిద్ధం చేశారు. దీనికోసం కళా వేదిక ఎదుట భారీగా పందిర్లు వేసి ప్రత్యేక మండపం ఏర్పాట్లు చేశారు.