ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్.. గులాంనబీ ఆజాద్ రాజీనామా

national |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 12:00 PM

కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించారు. తన రిజైన్కు గల కారణాలను లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 16న జమ్ము కాశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధిపతి పదవికి ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.


కాంగ్రెస్  పార్టీకి సుదీర్ఘకాలం పాటుసేవలందించిన సీనియర్ నేతలను పక్కన పెట్టడంపై తీవ్ర మనస్థాపం చెందానని లేఖలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాజకీయ పలుకుబడి క్షీణించడం.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో పేలవమైన పనితీరుకు రాహుల్ గాంధీ అపరిపక్వత కారణమని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com