సముద్ర తీర ప్రాంతాన్ని అందరం కాపాడుకోవాలి అని మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన పార్లె ఫర్ ది ఓషన్స్ సంస్థతో బీచ్ శుభ్ర పరచే కార్యక్రమంను రామకృష్ణ బీచ్ లో భారీ ఎత్తున శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లె సంస్థతో తీర ప్రాంత స్వచ్చత పై ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో మొట్టమొదటి కార్యక్రమని తెలిపారు. విశాఖలో 25 వేల మందితో 28 కిలో మీటర్ల దూరం 40 పాయింట్లలో మెగా సముద్ర తీర స్వచ్చత కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వివరించారు.