వి. కోట మండల పరిధిలోని గోవిందాపురం ఉన్నత పాఠశాలలో గురువారం ఎంపీడీవో బాలాజీ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టేలా సిబ్బంది పర్యవేక్షించాలని పేర్కొన్నారు.