టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గురువారం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచారు. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా నేటి నుంచి అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు