సత్తెనపల్లి: పట్టణంలో 8 వ సచివాలయ పరిధిలోని 25 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిర్వహించారు. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలు అందించారు. ప్రభుత్వ లబ్దిని సంక్షేమ పథకాలను అందిన విధానంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాలంటీర్ల సేవల మరవలేము అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.