ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీజేఐగా నేడు పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 04:09 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ దేశానికి అందించిన సేవలు ఎనలేనివి అని టీడీపీ నాయకులూ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేసారు. సీజేఐగా నేడు పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ  గురించి ఆయన మాట్లాడుతూ.... CJI గా 224 మంది న్యాయమూర్తులను నియమించి న్యాయ పరిరక్షణలో తనదైన ముద్ర వేసుకున్నారు.


న్యాయమూర్తిగా బెంచి పైకి వచ్చిన కేసులను పరిష్కరించడమే గాక సమాజహితం కోసం ఆయన చేసిన సూచనలు ఎంతో అమూల్యమైనవి. సీజేఐగా నేడు పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ గారి శేషజీవితం ఆనందంగా గడవాలని దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com