కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పని చేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు 'నా సేన కోసం నా వంతు' కార్యక్రమంలో భాగస్వాములై జనసేనకు స్వచ్చంద విరాళాలు అందించే వారికి అవగాహన కల్పించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు.
గురువారం జనసేన కేంద్ర కార్యాలయంలో నాగబాబు గారు 7288040505 @icici అనే UPI ఐడికి స్వచ్ఛందంగా విరాళం అందించి 'నా సేన కోసం నా వంతు' ప్రచార కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ.. స్వశక్తినే నమ్ముకుని జనసేన పార్టీ స్థాపించిన అధ్యకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకూ తమ స్వార్జితంతోనే పార్టీని నడిపిస్తున్నారని, స్వచ్ఛంద విరాళాల ద్వారా తోడ్పాటు అందిస్తే పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగకరం అవుతుందన్నారు.
పార్టీకి అండగా మన వంతుగా బాధ్యతగా విరాళాలు అందించేందుకు రూపొందించిన కార్యక్రమమని తెలిపారు. ప్రతీ జన సైనికుడిని, వీర మహిళను కుటుంబ సభ్యులుగా భావించే పవన్ కళ్యాణ్ ని మనమూ కుటుంబ సభ్యుడిగా భావించి అండగా నిలబడదామని వెల్లడించారు.