కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు IPS ఆదేశాల మేరకు కాకినాడ లోని APSP 3 వ బెటాలియన్ సిబ్బంది మరియు ఆఫీసర్లకు కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహనా సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ అవగాహనా సదస్సులో భాగంగా నిత్యం జరుగు రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ యొక్క ఆవశ్యకత, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో APSP అడిషనల్ SP అర్జున్ , కాకినాడ ట్రాఫిక్ DSP శ్రీ పడాల మురళీకృష్ణ రెడ్డి , అసిస్టెంట్ కమాండెంట్, ట్రాఫిక్ 2 CI చైతన్య కృష్ణ, APSP RI రఘుబాబు, సురేష్, ఇతర అధికారులు, 250 మంది సిబ్బంది పాల్గొన్నారు.