విజయనగరం జిల్లా పరిధిలో బైకు నేరాలకు పాల్పడిన నిందితుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామానికి చెందిన రౌతు శంకర్రావు (42 సం.లు) అనే వానిని ఆగస్టు 25న అరెస్టు చేసి, 1వ పట్టణ, ఒడిస్సా పొట్టంగి PS కేసుల్లో 5 బైకులను రికవరీ చేసినట్లుగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ S.కాంతారావు గారు మీడియాకు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరు ఎప్పటికైనా చట్టం ద్వారా శిక్షింప పడతారని హెచ్చరించారు. కాబట్టి సక్రమైన జీవితం కొనసాగించాలని పిలుపునిచ్చారు.