ఏపీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టులో శుక్రవారం భారీ ఊరట దక్కింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు ఆయన వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపును ఇచ్చింది. రోజువారీ విచారణకు సీఎం జగన్ హాజరు కావాలని ఇటీవల సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో హైకోర్టును సీఎం జగన్ ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. జగన్ వ్యక్తిగత హాజరుపై సీబీఐ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.