ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలోని మలక్పూర్ గ్రామంలో దారుణం జరిగింది. 32 ఏళ్ల సరోజ అనే మహిళ తన 18 నెలల మేనల్లుడిని "తాంత్రిక" పూజల్లో బలి ఇచ్చింది. బాలుడి హత్య కేసులో నిందితురాలైన మహిళ, ఆమె భర్తను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు సోమవారం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని, రెండు రోజుల తర్వాత బాలుడి శరీర భాగాలు చెరుకు తోటలో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.