జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించిన ఈసీ, హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం రద్దు చేసింది. దీని పై విచారించిన గవర్నర్ ఈసీ సిఫార్సుతో హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దు చేశారు. దీంతో సీఎంతో పాటు మంత్రులు పదవులు కోల్పోయారు.ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు తానే మైనింగ్ లు కేటాయించుకున్నాడని సోరెన్ పై ఆరోపణలున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ తరపున, ఆయన సీఎంగా ఉన్నారు.