మహారాష్టరంలో శివసేన పొత్తు రాజకీయాలకు తెరలేపింది. తాజాగా శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక ప్రకటన చేశారు. మరాఠా సంస్థ అయిన శంభాజి బ్రిగేడ్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శంభాజీ బ్రిగేడ్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ అని, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రాంతీయ గౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని కొనియాడారు.
ఉద్ధవ్ థాకరే ఇటీవలే సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. శివసేన రెబెల్ ఎమ్మెల్యే షిండే తన వర్గంతో కలిసి థాకరేపై తిరుగుబాటు చేశారు. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. శివసేన పార్టీ తమదేనని షిండే బృందం అంటోంది. ప్రస్తుతం ఈ మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది.