ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా వ్యాక్సిన్ సాంకేతికతను వారు కాపీ కొట్టారు..అమెరికా ఫార్మా సంస్థ ఆరోపణ

international |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 09:50 PM

కరోనా  వ్యాక్సిన్ తయారిపై రోజురోజుకు అధ‌్యయనాలు సాగుతున్న తరుణంలో ఇప్పటికే తయారైన వారిటపై తాజాగా వివాదం మొదలైంది. కరోనా సంక్షోభ సమయంలో దిగ్గజ ఫార్మా సంస్థలు పోటీపడి మరీ కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. ఇదిలావుంటే ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు తమ కరోనా వ్యాక్సిన్ సాంకేతికతను కాపీ కొట్టి అలాంటి వ్యాక్సిన్ నే తయారుచేశాయని అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా ఆరోపిస్తోంది.


ఈ మేరకు మోడెర్నా... ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలపై దావా వేసింది. 2010, 2016 మధ్య కాలంలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి దాఖలు చేసిన పేటెంట్ లను ఈ రెండు సంస్థలు ఉల్లంఘించాయని మోడెర్నా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి కణంలోనూ ప్రొటీన్ తయారీ వ్యవస్థలకు డీఎన్ఏ సంకేతాలను మోసుకెళ్లే జన్యు స్క్రిప్టునే ఎంఆర్ఎన్ఏ గా అభివర్ణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఈ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com