జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పార్టీ కోర్ గ్రూప్ సభ్యులతో హోంమంత్రి, బీజేపీ అధినేత అమిత్ షా శుక్రవారం సమావేశమయ్యారు. సంస్థాగత అంశాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, దేవేంద్ర సింగ్ రాణా, ఎంపీ జుగల్ కిషోర్, శక్తి రాజ్ పరిహార్‌లతో సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.కేంద్రపాలిత ప్రాంతంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కో-ఇంఛార్జి ఆశిష్ సూద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ కసరత్తు తర్వాత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు చర్చకు వచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు.