కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య శుక్రవారం విమర్శలు గుప్పించారు. ఆయన అసమర్థుడు, ఆర్ఎస్ఎస్ చేతిలో కీలు బొమ్మ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వమూ లేదు, పాలనా లేదు అంటూ పేర్కొన్నారు. ఆపరేషన్ కమలం ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొచ్చిందని, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదని అన్నారు.