ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)పై విధించిన సస్పెన్షన్ను ఫిఫా శుక్రవారం ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఫుట్బాల్ గ్లోబల్ గవర్నింగ్ బాడీ తెలిపింది. సస్పెన్షన్ను ఎత్తివేయడం వల్ల మహిళల అండర్-17 ప్రపంచ కప్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో భారతదేశంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏఐఎఫ్ఎఫ్పై ప్రభుత్వ పెత్తనం కారణంగా ఫిఫా నిషేధం విధించింది.