CPS రద్దుకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణతో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. 'సెప్టెంబర్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఆందోళనలను అణచివేస్తే ఆవేదన చల్లారదు. GPS విధానంపైనే చర్చించాలని చెప్పారు. అదనంగా బెనిఫిట్స్ ఇస్తామంటున్నారు. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. GPS గురించే చర్చించాలంటే పిలవడమెందుకు?' అని ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.