నెల్లూరు నగరం కాకర్ల వారి వీధిలోని లావణ్య జ్యువెల్లరీ షాప్‌లోకి ఐటీ అధికారులమంటూ భారీ దోపిడీకి యత్నించిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీలు చేయాలంటూ దుకాణంలో ఆరుగురు వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ.కోటిన్నర విలువైన బంగారాన్ని తీసుకొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిపై అనుమానం వచ్చిన దుకాణం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని అరెస్టు చేశారు.