మణిపూర్‌కు చెందిన 16 ఏళ్ల జుడోకా లింథోయ్ చనాంబమ్ చరిత్ర సృష్టించింది. జూడో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది.. శుక్రవారం జరిగిన క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2022లో మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో లింథోయ్ బ్రెజిల్‌కు చెందిన బియాంకా రీస్‌ను ఓడించింది. దేశానికి జూడో విభాగంలో ఇదే తొలి పతకం. ఆమెకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలు తెలిపింది.