తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు గ్రామాల్లో వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల వద్ద అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ స్వామి అన్నారు. శుక్రవారం ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ వినాయక దేవుడి విగ్రహాల ఏర్పాటుకు నిబంధనలతో కూడిన అనుమతి పొందాలని నిర్వాహకులకు సూచించారు. అనుమతి లేకుండా మైకులు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్టవిరుద్ధం అన్నారు.