ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి అదరగొట్టాడు. తన కెరీర్లో మూడోసారి 89 మీటర్ల మార్క్‌ను అధిగమించాడు. లాసాన్ డైమండ్ లీగ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైన తర్వాత మైదానంలోకి తిరిగి తాజాగా అడుగు పెట్టాడు. తన మొదటి ప్రయత్నంలో 89.08 మీటర్ల బెస్ట్ త్రో నమోదు చేసి, గోల్డ్ మెడల్ అందుకున్నాడు.