పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును కన్న తల్లే గొంతు నులిమి చంపేసింది. అయితే బాలిక తల్లి ఓ విద్యార్థిని. ఆమె వయసు 15 ఏళ్లు. బంధువు కారణంగా గర్భం దాల్చిన ఆమె శుక్రవారం ప్రసవించింది. ఆపై బిడ్డను చంపి, తాము ఉంటున్న 3వ అంతస్తు నుంచి కింద ఉన్న చెత్త కుండీలోకి విసిరేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక బామ్మను విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa