పాకిస్థాన్ అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు 3 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. పాకిస్థాన్‌లో ఏటా ఆగస్టులో సాధారణ వర్షపాతం 48 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది దాదాపు 241 శాతం అధికంగా 166.8 మిల్లీమీటర్లు నమోదు అయ్యింది.