బీహార్లోని దర్భంగాలో కొందరు దారుణంగా ప్రవర్తించారు. రాజోరా గ్రామానికి చెందిన రామ్ప్రకాష్ పాశ్వాన్ అనే దళితుడిపై కొందరు ఆగస్టు 16న మూకదాడి చేశారు. రక్తమోడేలా బాధితుడిని కొట్టారు. దాహం వేస్తుందని బాధితుడు పేర్కొనగానే నిందితులు అతడికి మూత్రం తాగించారు. ఎముకలు విరిగేలా కొట్టడంతో బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తాజాగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.