డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ను విధుల నుంచి తొలగించినట్లు డీజీసీఏ శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా 4 పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. మొదట డి–అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తారు. రెండోసారి ఫెయిలైతే 3 ఏళ్ళు సస్పెండ్ చేస్తారు. మూడోసారి ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు.