చిత్తూరు: రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యింది. మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసులు నమోదు అవ్వగా, మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. రామకుప్పం మండలం కొల్లుపల్లి గ్రామంలో బుధవారం జరిగిన టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య జరిగిన గొడవల కారణంగా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.