చిత్తూరు: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ మాసం పురస్కరించుకొని శనివారం ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లలో భక్తులు నిండిపోయారు. స్వామివారి దర్శనార్థం కొంత మేరకు సమయపాలన కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఆలయ ఈవో సురేష్ బాబులు పర్యవేక్షిస్తున్నారు.