గుంటూరు: ఏపీ, తెలంగాణలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ శుక్రవారం తెలిపారు. నిందితుడు గుంటూరుకి చెందిన ఇబ్రహీంగా గుర్తించామని, అతని వద్ద నుంచి 22 లక్షల విలువ గల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. లోన్ యప్ బాధితుల కేసుల్లో విచారణ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.