పొన్నూరు: పెదకాకానిలోని భ్రమరాంబ అమ్మవారిని శుక్రవారం పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాస పర్వదినం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలానే ఆలయ అవసరాలకు నాగళ్ళ చలపతిరావు రూ.80,000 తో వాటర్ ట్యాంక్ లు ఉచితంగా అందజేశారు.