నరసరావుపేట: తనిఖీల్లో పట్టుపడిన కేజీ బంగారం, 25 లక్షల నగదును రూరల్ పోలీసులు శుక్రవారం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. అల్లూరి వారిపాలెం వద్ద వాహనంలో శుక్రవారం తనిఖీలు చేస్తుండగా ప్రయాణిస్తున్న వారి నుంచి పోలీసులు బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పట్టణంలోని ఎన్ఓఎస్ జ్యూయలరీ షాపునకు చెందినవిగా గుర్తించారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని ఆదాయపు పన్ను శాఖాధికారులకు అప్పజెప్పారు.