ధర్మవరం: పట్టణంలోని కేశవ నగర్ లో ఉన్న చౌడేశ్వరి దేవాలయంలో దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ ఆవరణంలోని గేటును పగలగొట్టి ఆలయంలో గల హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఆలయ నిర్వాహకులు పరిస్థితిని గమనించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మవరంలో కొంతకాలంగా దేవాలయాలలో చోరీలు అధికం కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.