రొళ్ల: మండల పరిధిలోని మలసముద్రం నుంచి బీజీహళ్లి హైస్కూల్ కు వెళ్లే విద్యార్థులు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చినప్పుడు విద్యార్థులు పాఠశాలకు సైతం వెళ్లడం లేదు. పాఠశాలకు వెళ్లాలంటే వంక దారిగుండానే వెళ్లాలి. వర్షం వస్తే వంక నీటితో నిండిపోయి రాకపోకలు పూర్తిగా బంద్ అవుతాయి. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని విద్యార్ధులు, గ్రామస్థులు కోరుతున్నారు.