నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో శనివారం ఊహించని ఘటన జరిగింది. అకస్మాత్తుగా రహదారి రెండుగా చీలి పోవడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రహదారిపై కొంత దూరం ఇలాగే దర్శనమిచ్చింది. దీనిని పియూష్ రాజ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిందా లేక పనుల్లో నాణ్యతా లోపం వల్ల ఏర్పడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.