టీడీపీ జాతీయ నాయకులూ నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో వైసిపి అల్లరి మూకలు అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడంతో పాటు, తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తూ అడుగడుగునా సృష్టిస్తున్న ఆటంకాలపై నిరసన తెలిపేందుకు అనంతపురం టీడీపీ నాయకులూ పరిటాల శ్రీరామ్ బయలు దేరారు.
నిరసన తెలియచేయడానికి శాంతియుతంగా వెళ్తున్న మమ్మల్నిరామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట అడ్డుకొని టిడిపి కార్యకర్తలపై సీఐ చిన్న గౌస్ నోరు పారేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము!! అని ఆయన అన్నారు. పోలీస్ లు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి కట్టుబడి పని చెయ్యాలి తప్ప, అధికారంలో ఉన్న పార్టీలకి కాదు అని గుర్తుచేశారు. ఇలాంటి పరిణామాలు సృష్టిస్తున్న వారి పరిస్థితి వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం మారితే ఎలా ఉంటాదో కూడా గమనించుకోవాలి హెచ్చరించారు.