గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, విజయవాడ లో వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక 22వ డివిజన్ 110వ సచివాలయం పరిధిలోని స్వర్గపురి 5వ వీధి నుండి ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి గురించి వివరించి, ప్రభుత్వం ద్వారా వారు పొందిన సంక్షేమ లబ్ది వివరాలను కరపత్రాల రూపంలో అందజేయడం జరిగింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో మాదిరి కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చే పని లేకుండా వలంటీర్ల ద్వారా నేరుగా మా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని మహిళలు తమ ఆనందం వ్యక్తం చేస్తూ,వైసీపీ నాయకులకి హారతులు పడుతూ బ్రహ్మరథం పడుతున్నారు.