ఏపీ ప్రజలకు అలర్ట్. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని, ఈ తరుణంలో మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, ఈదుర గాలులు ఉంటాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa