గుంటూరు: టీడీపీ కార్యకర్త బి. వెంగళరావు అరెస్టుపై సీఐడీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కోదాడలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వెంగళరావు పై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐపిసి 153ఏ, 505(2), 506, 386, 12బి, సెక్షన్ తోపాటు ఐటీ చట్టం సెక్షన్ 67 ఏ కింద కేసు నమోదు చేశారు. వెంగళరావుని గుంటూరులో న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు.