గుంటూరు, వట్టి చెరుకూరు: కొర్నేపాడు గ్రామంలో సయ్యద్ సాహిద్దీసా ను భర్త జాన్ బాబు, అత్తమామలు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని వట్టి చెరుకూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదయింది. గత ఆరు నెలలుగా భర్త, అత్తమామలు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.