యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బఖర్వా గ్రామానికి చెందిన సునీల్ (45), దీప భార్యాభర్తలు. అయితే 10 ఏళ్లుగా రవి అనే వ్యక్తితో దీప ఎఫైర్ కొనసాగిస్తోంది. ఈ విషయం ఇటీవల సునీల్‌కు తెలిసింది. దీంతో ప్రియుడు రవితో కలిసి ఆగస్టు 23న భర్తను చంపేసింది. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి, పొలాల్లో పడేశారు. పోలీసుల విచారణలో వీరి గుట్ట బయట్టపడింది. దీంతో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.