ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో వాయుగుండం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 04:42 PM

ఈ ఏడాది వరుణుడు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాధారణం కన్నా భారీ వర్షపాతం నమోదయ్యింది. రుతుపవనాలతో పాటు అప్పపీడనాలు, వాయిగుండాల ఎఫెక్ట్‌తో బాగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో వెదర్‌ అప్‌డేట్ వచ్చేసింది. మళ్లీ వానలొస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో వాయు’గండం’ వెంటాడుతుంది. ఇది అంతకంతకూ బలపడి తీవ్ర వాయిగుండంగా మారే ఛాన్స్ ఉందని తాజాగా ఐఎండీ తెలిపింది. 


దీని ఎఫెక్ట్‌తో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సముద్ర తీరాల్లో అలలు ఎగసిపడే అవకాశం ఉందని. ఇక తీర వెంబడి భారీ గాలులు వీసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com