నేటి సమాజంలో ప్రతి ఒక్కరు పాశ్చాత్య పోకడలు పై దృష్టి సారిస్తున్నారని ఈ విధానం మంచిది కాదని దేశానికి తీవ్ర నష్టమని ప్రభుత్వ విప్ కర్ణధర్మ శ్రీ ఆందోళన చేశారు. అజాద్గా అమృత మహోత్సవంలో భాగంగా శనివారం చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ చైనులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరు జాతీయ భావాలు అలవర్చుకోవాలని దేశంపై ప్రేమ అభిమానాలు పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు ఉన్నత చదువులు ఏ దేశంలో చదివిన తిరిగి స్వదేశంలోనే వారి బాధ్యతలు నిర్వర్తించాలని తద్వారా దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావుల త్యాగం మూలంగా మన స్వతంత్రాన్ని సాధించుకొని 75 ఏళ్ళు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామని, మరోపక్క అజాద్ అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నమని ఈ స్ఫూర్తితో ప్రతి ఒకరు దేశా సేవ కు అంకితం కావాలన్నారు.
ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారే ఈనాడు దేశ నాయకులుగా మిగిలారని వారి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రైవేట్ పాఠశాలలను తలదన్నే విధంగా తయారు చేస్తున్నారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు మరో అతిథిగా పాల్గొని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చైన్లు ఆజాద్గా అమృత మహోత్సవాల విశిష్టత గురించి, ప్రధానమంత్రి మోడీ తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ , ఎంపీపీ కాసులమ్మ, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, ఈ ఒ ఆర్ డి చైతన్య, వైసిపి నాయకులు బి సూర్యనారాయణ, పళ్ళ నర్సింగరావు, అధ్యాపకు బృందం విద్యార్థులు పాల్గొన్నారు.