విశాఖపట్నం: చోడవరంలో వేంచేసి ఉన్న శ్రీ ఆపదహార వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నుండి అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభమైంది. కరోనా ముందు వరకు ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో అన్నదాన కార్యక్రమాలు నిలిపివేశారు. అయితే కరోనా తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో మరలా శనివారం నుండి అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆలయ కమిటీ చైర్మన్ కే గౌరీ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధర్మశ్రీ స్వయంగా కొద్దిసేపు వడ్డన కార్యక్రమం లో పాల్గొని వడ్డించారు. అనంతరం సహపంక్తి భోజనంలో పాల్గొని భోజనం చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గౌరీ శంకర్ నీ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో చోడవరం సిఐ బి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.